
సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాలి. కొందరు హీరోయిన్ల విషయంలో లక్కు చాలా కలిసోస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ నటించిన 7 సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినా ఆమె డిమాండ్ తగ్గడం లేదు.

ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలకు జోడిగా నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఈమధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది.

ఆ హీరోయిన్ పేరు పూజా హెగ్డే. 2010 అందాల పోటీలో పాల్గొని రన్నరప్ అయ్యింది. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా అత్యధిక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తక్కువ సమయంలోనే ఓ వెలుగు వెలిగిన పూజా.. ఆ తర్వాత జోరు తగ్గించింది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. అయినా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా, రెట్రో వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. కానీ కూలీ సినిమాలో మోనికా పాటతో సెన్సేషన్ అయ్యింది. అలాగే ఇప్పుడు విజయ్ దళపతి జోడిగా జన నాయకుడు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.