బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో సినిమాలు చేయడం కామనే .. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చారు. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. ఆ బ్యూటీనే జాన్వీ కపూర్.
చాలా కాలంగా తెలుగులో నటించాలని ఎదురుచూస్తుంది ఈ చిన్నది. దఢక్ సినిమాతో హీరోయిన్ గా హిందీలో పరిచయమైనా జాన్వీ అక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాల విషయంలో ఈ చిన్నది చాలా జాగ్రత్తగా ఉంటుంది.
వచ్చిన సినిమాలన్నీ చేయకుండా ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది జాన్వీకపూర్. ఇక ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది కన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాన్వీ పల్లటూరి అమ్మాయిలా కనిపించనుంది.
ఇక ఈ సినిమాకోసం జాన్వీ కపూర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం జాన్హవి కపూర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. జాన్వీ తన మొదటి తెలుగు సినిమాకే 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటోందట.