
హీరోయిన్ ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2008లో ఆమె 1920 అనే సినిమాలో కనిపించి.. తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇందులో లిసా అనే అమ్మాయిగా ఆమె నటించింది.

1920 చిత్రంలో భయానక సన్నివేశాలలో కనిపించింది. ఈ చిత్రం కథ, పాటలు, సంగీతం, పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ సినిమాలో వచ్చే సీన్స్, భయానక సన్నివేశాలు మీకు వణుకు పుట్టిస్తాయి. రాత్రిపూట ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. అంతేకాదు.. క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు. ఇందులో ఆదా శర్మతోపాటు రజనీష్ దుగ్గజ్ ప్రధాన పాత్ర పోషించారు.

అనుకోకుండా ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో చూసినా కూడా మీరు ఖచ్చితంగా ఉలిక్కిపడతారు. ఒక సన్నివేశంలో, ఒక ఆత్మ లిసాను లోపలికి లాక్కుంటుంది. ఆ సన్నివేశం అత్యంత ధైర్యవంతులైన వ్యక్తులకు కూడా చెమటలు పట్టేలా చేస్తుంది.

ఆమె ఒక స్తంభం ఎక్కి భయంకరమైన శబ్దాలు చేసే దృశ్యం కూడా మీ వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో ఆదా శర్మ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.