
ఒకప్పటి ప్రముఖ నటి, కేజీఎఫ్ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఇప్పుడు తన కుటుంబానికి ఫుల్ టైమ్ వెచ్చిస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార తన పిల్లలు ఐరా, ఆథర్వ్‌ల పోషణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది.

ఇక కేజీఎఫ్ హీరో కూడా తన నెక్ట్స్ ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్ చేయలేదు. దీంతో అధిక సమయం తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడుపుతున్నాడు. తరచూ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్లకు వెళుతున్నాడు. పండగలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

ఇటీవల హీరో యశ్, రాధికా పండిట్ ఇంట్లో వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్ దంపతులతో పాటు పిల్లలు కూడా సంప్రదాయ దుస్తు్ల్లో మెరిశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది రాధికా పండిట్. తరచూ తన ఫ్యామిలీ ఫొటోస్‌లను నెట్టింట షేర్ చేసుకుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. . రాధికా పండిట్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కాగా రాధికా పండిట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 32 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను షేర్ చేసిన గంట వ్యవధిలోనే నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేల మంది కామెంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.