
అందాల ముద్దుగుమ్మ కీర్తిసురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు తమిళ్ భాషల్లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం ఇటు తెలుగులో అటు తమిళ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ వయ్యారి భామ.

తాజాగా ముద్దుగ్గుమ్మ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్ స్వయంగా ప్రకటించింది.

“నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను.

దయచేసి కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొండి. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి...అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో అలాగే చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.