
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా కనిపించనుంది ఈ బ్యూటీ.

ఇటీవల న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కీర్తి. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో అదరగొట్టింది.

తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది కీర్తి. ఈసారి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కీర్తి సురేష్.

ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు తమిళ్ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్గా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమాకు డైరెక్టర్ గణేష్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించనుంది.

ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలతో శనివారం చెన్నైలో ఘనంగా ప్రారంభించారు మేకర్స్. గతంలో మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది కీర్తి.