శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పిండం. కాలాహి మీడియా బ్యానర్‌లో యశ్వంత్ దగ్గుమాటి సినిమాను నిర్మిస్తున్నారు. నవంబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా టీజర్ విడుదలైంది. ఓ మారుమూల ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ తిరిగినట్లు అర్థమవుతుంది.