
శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కాయదు లోహర్. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తొలి సినిమాతో అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది.

ఇక ఇటీవలే డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేసింది ఈ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫొటోలతో పాటు పద్ధతైన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది.

ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో కవ్వించింది కాయదు లోహర్. ఈ అమ్మడి ఫోటోల పై కుర్రకారు కవిత్వాలు రాస్తున్నారు.