కరోనా అందులోను ఒమిక్రాన్ ప్రకంపనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు.
ముందుగా అనుకున్నట్లు గానే విక్కీ, కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసేదాక వీరి పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు.
ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటి బయటకు వచ్చి నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.
కాగా కత్రినా సోదరీమణులు ఆమెను పెళ్లి మండపానికి ఊరేగింపుగా తీసుకెళుతోన్న ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటలను ఇన్‌స్టాలో పంచుకున్న కత్రినా 'మా సోదరీమణులు ఎల్లప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటాము. మేము ఎప్పుడూ ఇలాగే ఒకరికొకరు అండంగా ఉంటాం... ఇది ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి' అని రాసుకొచ్చింది.