Rajitha Chanti |
May 07, 2023 | 4:58 PM
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దాదాపు 7 సంవత్సరాలు నెంబర్ వన్ సీరియల్ గా సత్తా చాటింది. ఈ సీరియల్ చూడని ఇల్లు ఉండదు.
ఇందులో హీరోహీరోయిన్ దీప, కార్తీక్ ఎంతో పాపులరో.. అంతకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది విలన్ మోనితా.. అలియాస్ శోభా శెట్టి.
కార్తీక్, దీపలను ముప్పుతిప్పలు పెట్టిన మోనితా అందానికి ఆడియన్స్ ఫ్యాన్స్ కాగా.. ఆమె నటనకు ఫిదా అయ్యారు చాలా మంది. ఒకానొక సమయంలో మోనితా లేకపోతే సీరియల్ చూడడం ఇంట్రెస్ట్ లేదనే కామెంట్స్ వచ్చాయి.
అంతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శోభా. విలనిజంలోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఈ సీరియల్ ముగిసిన తర్వాత శోభా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది.
గతంలో తనకు పెళ్లి చూపులంటూ ఓ వీడియో షేర్ చేస్తూ అభిమానులను కన్ఫ్యూజ్ చేసింది. కానీ తనకు నిజంగా పెళ్లి కాలేదని క్లారిటీ సైతం ఇచ్చేసిందనుకోండి.
తాజాగా ఈ అందాల రాక్షసి పెళ్లి కూతురిగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. కానీ నిజానికి పెళ్లి కాదు.. కేవలం ఓ బ్రైడల్ మేకప్ సంస్థ కోసం ఇలా అందంగా రెడీ అయ్యింది.
బంగారు రంగు పట్టు చీరలో.. మెడలో ఆభరణాలతో అందంతో మైమరపిస్తోంది శోభా. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతుంది.
పెళ్లి కూతురిగా ముస్తాబైన అందాల రాక్షసి.. స్వయంవరం ప్రకటించిన యువరాణిలా కార్తీక దీపం మోనితా..