Yash: బెంగుళూరులో ఖరీదైన ఇల్లు కొన్న యష్.. భార్యతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన రాకీబాయ్.. ధర ఎంతంటే..

|

Jul 02, 2021 | 8:14 PM

చాలా మందికి సొంతంగా ఇళ్లు కట్టుకోవాలని అనుకుంటుంటారు. అందులోనూ తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే కొందరికి మాత్రమే ఆ కల నెరువేరుతుంది. తాజాగా రాక్ స్టార్ యష్ సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.

1 / 6
కన్నడ స్టార్ హీరో యష్ ఓ ఇంటివాడయ్యాడు. బెంగుళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యష్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులో తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోని తన భార్యతో కలిసి గృహ ప్రవేశం చేశారు..

2 / 6
 ఆ ఇంట్లో ఖరీదైన వైట్ మార్పుల్, వుడ్ ఫర్నిష్ తోపాటు అత్యాధునిక సదుపాయాలతో ఆ హోం సెలెక్ట్ చేసుకున్నారు. ఇందుకోసం యష్ దాదాపు రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేశాడట.

3 / 6
గురువారం తన భార్యతో కలిసి యష్ నూతన గృహప్రవేశం చేశాడు. ఈ వేడుకకు యష్ తల్లిదండ్రులతోపాటు.. కొంతమంది కుటుంబసభ్యులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

4 / 6
యష్ కొత్త ఇంటి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన యష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు.

5 / 6
ప్రస్తుతం యష్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. ఇది కేజీఎఫ్ సినిమాకు సిక్వెల్ గా నిర్మిస్తుండగా... ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

6 / 6
ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింక్ చివరిదశలో ఉండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.