
డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణక, తను వెట్స్ మను వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా.

ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె నటించిన తను వెడ్స్ మను సినిమా రూ.100 కోట్లు దాటిన తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ముక్కుసూటిగా మాట్లాడడంతో బాలీవుడ్ పెద్దలు ఆమెను దూరం పెట్టారు.

ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తనే నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తుంది. ఇప్పుడు బీజీపీ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఆమె ఎంపిగా పోటీ చేసి ఘన విజయం సాధించింది.

తాజాగా బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది కంగనా. బాలీవుడ్ సినిమాల్లో వివాహబంధాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఆమె అన్నారు. అంతే కాదు బాలీవుడ్ సినిమాల్లో స్త్రీల విలువను తగ్గించే సందర్భాలెన్నో చూశాను అని కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.