Rajitha Chanti |
Oct 19, 2024 | 6:33 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. తండ్రికొడుకుల పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇందులో తండ్రి క్యారెక్టర్ దేవరకు జోడిగా నటించింది శ్రుతి మరాఠీ. ఈ సినిమాతో చాలా ఫేమస్ అయ్యింది.
దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈబ్యూటీ చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడు గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. గుజరాత్ కు చెందిన ఈ బ్యూటీ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది.
మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్ ను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి చిత్రం అయినప్పటికీ అందం, అభినయంతో కట్టిపడేసింది.