
ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు.

అది నిజమే అయితే గనక.. ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలాసార్లు వింటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. అదేంటి యాంకర్ పార్ట్‌లోనేమో నల్ల సముద్రం అని.. ఇక్కడేమో ఎన్టీఆర్, వార్ 2 అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా..?

ఇక్కడే ఉంది అసలు కథ. ఈ మధ్య ఎన్టీఆర్‌కు సముద్రం బాగా కలిసొస్తుంది. దేవరలో ఎర్ర సముద్రం పాపులర్ అయింది.. ఇందులో సముద్రాన్ని క్రియేట్ చేయడం కోసం హాలీవుడ్ టీం పని చేసారు.

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, ప్రజెంట్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల పనుల్లో బిజీ అయ్యారు. దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా షార్ట్ గ్యాప్ తరువాత సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేశారు.

ఈ సినిమాలో మేజర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ నల్ల సముద్రం దగ్గర షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇది బల్గేరియా, జార్జియా, రష్యా లాంటి దేశాలు సరిహద్దులుగా ఈ బ్లాక్ సీ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్‌కు ఓ క్లారిటీ ఉంది.

సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉన్నా.. ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నా.. స్క్రీన్ మాత్రం నల్లగా మసి పూసినట్లుంటుంది. ఇకిప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నల్ల సముద్రమే చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

యూరప్, బల్గేరియా సమీపంలోని బ్లాక్ సీ దగ్గరే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కేజియఫ్, సలార్‌కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. యాక్షన్ పార్ట్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ హెవీగా ఉండబోతుందని.. రెండు భాగాలుగా ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది.

యతి రోల్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నటుడ్ని సెలెక్ట్ చేయటం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్నారు. ప్రజెంట్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, నెక్ట్స్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు.