
జైలు నుంచి వచ్చిన తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ తో పాటు పలు సినిమాలకు నృత్య రీతులు సమకూర్చాడు.

ఆ మధ్యన ఓ కన్నడ సినిమా సెట్ లోనూ సందడి చేశాడు. అలాగే సన్నీ డియోల్- గోపిచంద్ మలినేని సినిమా జాట్ కు కూడా జానీనే కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

తాజాగా జాట్ సినిమాలోనే జానీ మాస్టర్ కూతురు అలియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ స్టార్ కొరియోగ్రాఫర్.

హీరోయిన్ రెజీనా, రణ్ దీప్ హుడా, రవిశంకర్, డైరెక్టర గోపీ చంద్ మలినేని తదితరులు జానీ మాస్టర్ కూతురికి బర్త్ డే విషెస్ చెప్పి దీవెనలు అందించారు.

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చిన జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.