Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. ఫొటోస్ ఇదిగో

|

Jan 04, 2025 | 5:15 PM

బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శనివారం (జనవరి 04) తన బాయ్ ఫ్రెండ్ శిఖర్‌ పహారియా తో కలిసి ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

1 / 5
 దివంగత అందాల తార శ్రీదేవి గారాల పట్టి, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌కు దైవ భక్తి ఎక్కువే. షూటింగుల నుంచి కాస్త విరామం దొరికితే చాలు తిరుమలలో వాలిపోతుంది.

2 / 5
 ఇక శ్రీదేవి పుట్టిన రోజు, వర్ధంతి, సినిమా రిలీజులు, పండగలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందీ అందా తార.

3 / 5
 తాజాగా మరోసారి తిరుమల వెంకన్నను దర్శించుకుంది జాన్వీ. కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం స్వామి వారి సేవలో పాల్గొంది.

4 / 5
 జాన్వీ వెంట ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా ఉన్నాడు.  తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జూనియర్ శ్రీదేవి.

5 / 5
 ఇందులో తిరుమల లడ్డూను తింటున్న ఫొటో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.