బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు దక్షిణాదిలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ జోడి చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు.