Jahnvi kapoor: జాన్వీ కపూర్ టాలీవుడ్‌కే ఫిక్సయిపోయారా..

Edited By: Phani CH

Updated on: Mar 08, 2025 | 1:30 PM

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? ఫ్యాన్స్ తలచుకుంటే ట్రెండింగ్‌కి కొదవా? అన్నట్టుంది పరిస్థితి. నిన్నటి నుంచి ఏక్‌ధమ్‌ ట్రెండ్‌ అవుతూనే ఉన్నారు జాన్వీ కపూర్‌. ఇంతగా ట్రెండ్‌ కావడానికి బర్త్ డే సెలబ్రేషన్స్ మాత్రమే రీజనా.. అంటే.. అదేంటి గురూ అలా అంటున్నారు.. నెక్స్ట్ టాలీవుడ్‌ని ఏలేది ఆ అమ్మాయే అని అంటున్నారు ఫ్యాన్స్.

1 / 5
చుట్టమల్లే చుట్టేసింది మన జాన్వీ కపూర్‌. మొన్న మొన్నటిదాకా బాలీవుడ్‌కే పరిమితమైనా.. ఏనాడూ ఆమెని పొరుగమ్మాయిలా చూడలేదు మనవాళ్లు. తెలుగు సినిమాలు చేసేయ్‌ అమ్మా అని బుజ్జగిస్తూనే ఉన్నారు.

2 / 5

ఆ మాటలు విన్న శ్రీదేవి తనయ దేవరతో ఎంట్రీ ఇస్తే సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. దేవరలో జాన్వీని చూసి మా తంగం అనుకున్నారంతా. దేవర సెకండ్‌ పార్టు కోసం ఆల్రెడీ 2026లో కాల్షీట్‌ కేటాయించేశారు ఈ బ్యూటీ.

3 / 5
ఇప్పుడు మాత్రం రామ్‌చరణ్‌ సినిమా షూటింగ్‌తో యమా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన జాన్వీ లుక్‌ అదిరిందంటున్నారు అభిమానులు. ఆర్సీ 16 షూట్‌ కంప్లీట్‌ కాగానే అల్లు అర్జున్‌ - అట్లీ సినిమా యూనిట్‌తో జాయిన్‌ అవుతారట శ్రీదేవి తనయ.

4 / 5
ఐకాన్‌ స్టార్‌ పక్కన అద్భుతమైన రోల్‌ కుదిరిందంటూ హ్యాపీగా ఉన్నారట జాన్వీ. డ్యాన్సుల్లో బన్నీని ఈక్వెల్‌ చేయడానికి ఇప్పటి నుంచే కాసింత స్పెషల్‌గా శ్రద్ధ పెడుతున్నారట.

5 / 5
తెలుగులో ఒకటికి మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి జాన్వీకి. ముగ్గురు లీడింగ్‌ హీరోల మూవీస్‌లో చేస్తున్నారు. సో, అడపాదడపా బాలీవుడ్‌ మూవీస్‌  చేసినా, ఫుల్‌ టైమ్‌ తెలుగుకే అలాట్‌ చేసేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు సిల్వర్‌స్క్రీన్‌ తంగం.