
కొందరు హీరోయిన్లుంటారు. వాళ్లు ఇప్పటిదాకా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసిన దాఖలాలే ఉండవు. అయినా వాళ్లని మనం పరాయి వాళ్లుగా చూడలేం. ఎప్పుడూ మనవాళ్లే అనుకుంటూ ఉంటాం. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలాంటి ఫీలింగ్సే క్రియేట్ చేశారు యూత్ హార్ట్ థ్రోబ్స్ జాన్వీ కపూర్ అండ్ మాళవిక మోహనన్. నెక్ట్స్ ఇయర్ డైరక్ట్ తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీస్.

సోషల్ మీడియాలో యూత్‌ని ఎలా ఎంగేజ్ చేయొచ్చో జాన్వీ, మాళవికకు బాగా తెలుసు. వెకేషన్ ఫొటోలు, బీచ్ వ్యూస్, బికినీస్, అల్ట్రా గ్లామరస్ ఫొటోషూట్‌లంటూ ఓ రేంజ్‌లో గ్లామర్ స్టిల్స్ షేర్ చేస్తుంటారు వీరిద్దరూ. వాళ్లను సోషల్ మీడియాలో పాలో అవుతున్న వారు తెలుగు సినిమాలు చేస్తే చూడాలని ఉందని బోలెడన్ని సార్లు రిక్వెస్టులు పెట్టారు. ఫ్యాన్స్ మాటల్ని సీరియస్‌గా పట్టించుకున్న జాన్వీ కపూర్ తన అభిమాన హీరో తారక్‌తో ఎన్టీఆర్ 30లో జోడీ కడుతున్నారు.

నార్త్ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసిన జాన్వీ, ఇప్పుడు తెలుగు సినిమాలోనూ అలాంటి పాత్రలోనే కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఆమె స్టిల్.... పల్లెటూరి ఎటైర్‌ని రిఫ్లెక్ట్ చేస్తోంది. తారక్‌తో జాన్వీ కెమిస్ట్రీని ఆన్ స్క్రీన్ విత్‌నెస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు ఫ్యాన్స్.

అటు మాళవిక మోహనన్ కూడా ఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ సరసన నటించడానికి డాటెడ్ లైన్స్ తో సైన్ చేశారు ఈ బ్యూటీ. ఆల్రెడీ మాస్టర్‌లాంటి సూపర్‌డూపర్ సక్సెస్‌తో జనాల మనసు దోచుకున్నారు మాళవిక.

2024లో తెలుగు తెరమీద సందడి చేయడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు జాన్వీ అండ్ మాళవిక. ఓ వైపు ఆన్‌స్క్రీన్ పెర్ఫార్మెన్స్‌లు, మరోవైపు సోషల్ మీడియా ఫొటో షేరింగులతో ఫ్యాన్ పాలోయింగ్‌ని పెంచుకునే పనిలో ఉన్నారు ఈ బ్యూటీస్.