
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు పట్టు పరికిణిలో కట్టిపడేస్తుంది. నిత్యం మోడ్రన్ ఫోజులతో నెట్టింట రచ్చ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు బంగారు రంగు బ్లౌజ్ ధరించి, గులాబీ రంగు లెహంగా, దుపట్టా ధరించింది.

నుదుటిపై ఉన్న చిన్న బిండి ఆమె లుక్ మరింత అందంగా మార్చేసింది. జాక్వెలిన్ తండ్రి శ్రీలంకకు చెందినవారు. తల్లి మలేషియా. చిన్నప్పటి నుంచే విభిన్న సంస్కృతి, సంప్రదాయల మధ్య పెరిగింది.

ఆమె టెలివిజన్ రిపోర్టర్ గా వర్క్ చేసింది. ఆ తర్వాత 2006లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని సొంతం చేసుకుంది.

2009లో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓవైపు సినిమాలు.. మరొవైపు స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టింది. ఈ బ్యూటీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా పట్టు పరికిణిలో అందమైన లుక్స్ తో కట్టిపడేసింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. గోల్డెన్, మెరూన్ లంగావోణిలో జాక్వెలిన్ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు.