
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకడు. మొదట ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు

మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన కార్తీక్ ఆ తరువాత జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టాడు. తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మొదట ధనాధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేరిన అతను ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్ టీమ్ లోనూ మెరిశాడు

ఇక 2016లో ముక్కు అవినాష్ తో కలిసి టీమ్ లీడర్ అయిపోయాడు కార్తీక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్ గా నే కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులకు తనదైన వినోదం అందిస్తున్నాడు. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలతో మెరుస్తున్నాడు కార్తీక్.

ఇక అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిస్తున్నాడు కెవ్వు కార్తీక్. ఈ మధ్యన ముఖ చిత్రం, నేడు స్టూడెంట్ సార్ సినిమాల్లో కార్తీక్ కీలక పాత్రలు పోషించాడు. ఇందులో ముఖ చిత్రం సినిమాకు ప్రశంసలు వచ్చాయి.

జబర్దస్త్ షూటింగులతో బిజీగా ఉండే కెవ్వు కార్తీక్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల వెళ్లాడు. శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

అంతకు ముందు స్వర్ణగిరి, యాదగిరి ఆలయాలను సందర్శించింది కార్తీక్ ఫ్యామిలీ. కాగా 2023లో శ్రీలేఖ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కార్తీక్.