
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు, స్టెల్లాది ప్రేమ వివాహం. సుమారు రెండు సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ క్యూట్ కపుల్.

తాజాగా తమ గారాల పట్టి రాకను పురస్కరించుకుని యాదమ్మరాజు, స్టెల్లా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

'ఎనిమిదేళ్ల ప్రేమ ప్రయాణం, రెండేళ్ల భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మన కూతురు. మొన్నటివరకు మేం కేవలం భార్యాభర్తలం మాత్రమే ఇప్పుడు తల్లిదండ్రులం కూడా!'

మేం మొదటి నుంచి కూతురే పుట్టాలనిఅనుకున్నాం. ఆ దేవుడు కూడా మా కోరికను నెరవేర్చాడు. మా పాప మా బంగారుతల్లి, ఇప్పుడు తనే మా సర్వస్వం'

'ఈ బిడ్డ మాకు దేవుడు పంపిన కానుక కాబట్టి తనకు గిఫ్టీ అని నిక్‌నేమ్ పెట్టాం' అని ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చారు యాదమ్మ రాజు, స్టెల్లా.

యాదమ్మ రాజు దంపతులు షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు