
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన 'స్పై' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. ఈ మూవీతో తెలుగులోనూ మంచి మార్కులు కొట్టేసింది.

ఇంజినీరింగ్ విద్య చదివిన ఐశ్వర్య మీనన్.. అనుకోకుండా హీరోయిన్‌గా మారింది. కాలేజీ డేస్‌లో పలు యాడ్ ఫిలిమ్స్‌లో నటించిన ఐశ్వర్యకు.. హీరోయిన్ అవకాశాలు వరుసగా తలుపు తట్టాయి.

2012లో 'కదలిల్ సోధప్పువదు ఎప్పడి' అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయమైంది ఐశ్వర్య మీనన్. అదే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది ఈ అందాల భామ.

తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య మీనన్.. తెలుగులో 'స్పై' చిత్రంతో మెయిన్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తన అందచందాలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.

'స్పై' సినిమాలోని పాత్ర కోసం ఆరు నెలలు స్పైషన్ ట్రైనింగ్ తీసుకున్నట్టు గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మీనన్ తెలిపింది. తన కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఇదేనని కూడా స్పష్టం చేసింది.

తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించిన ఐశ్వర్య.. 'తమిళ్ రాకర్స్' అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇప్పుడు మలయాళంలో 'బజూక' అనే సినిమా చేస్తోంది.