
టైమ్ బాగున్నపుడు ఏం చేసినా చెల్లుతుంది. అదే టైమ్ అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్నిరిగిద్ది. ఇన్నాళ్లూ శంకర్ మొదటిది చేస్తే.. ఇప్పుడు రెండోది చేయాల్సి వస్తుంది. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ తర్వాత ఈయన మార్కెట్ భారీగా పడిపోయిందనేది కాదనలేని వాస్తవం.

అది శంకర్ కెరీర్ మీద దారుణంగా ప్రభావం చూపిస్తుంది. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా.. బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేసారు.. షూట్ చేసింది చూపించలేదనే విమర్శలొచ్చాయి.

పైగా గేమ్ ఛేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేసాయి. పెద్ద దర్శకుడిని అంటారు.. ఆ మాత్రం ప్లానింగ్ లేదా అంటూ సెటైర్లు పడ్డాయి. గేమ్ ఛేంజర్ చూసాక.. సగం షూట్ అయిన ఇండియన్ 3ని ఆపేయాలని లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి.

పైగా శంకర్, కమల్, లైకా మధ్య టర్మ్స్ కూడా పెద్దగా బాగోలేవు. అందుకే ఇండియన్ 3 రానట్లే అని ప్యాన్స్ కూడా ఫిక్సయ్యారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ సడన్‌గా సీన్‌లోకి వచ్చారు.. ఆయనకు లైకాతో చాలా మంది సంబంధాలున్నాయి.

రజినీకాంత్ రాయబారంతో ఆగిపోయిన ఇండియన్ 3ని మళ్లీ మొదలు పెట్టడానికి లైకా ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతుందిప్పుడు. కాకపోతే తామిచ్చిన బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేయాలని శంకర్‌కు లైకా కండీషన్ పెట్టారని వార్తలొస్తున్నాయి. అన్నట్లు తాజాగా ఇండియన్ 2 నుంచి శౌర అనే పాటను కూడా విడుదల చేసారు మేకర్స్.