
ఇల్లు కట్టి చూడూ... పెళ్లి చేసి చూడూ... అని అంటారు. ఆల్రెడీ ఇల్లు కొనడం పూర్తయింది. ఇక మిగిలింది అంతా పెళ్లే కదా... ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? ఇంకెవరు పూజా మేడమ్ గురించే. రీసెంట్‌గా ముంబై బాంద్రాలో ఇల్లు కొనుక్కున్నారు.

ఇక మిగిలింది డుమ్ డుమ్ డుమ్ కదా.. దాని గురించే మాట్లాడుతున్నారు నార్త్ జనాలు. జిగేల్ రాణి చేతిలో నార్త్ లో రెండు సినిమాలున్నాయి. వాటికి కూడా చెప్పుకోదగ్గ బజ్ లేదు.

ఆమె వికీపీడియాకు వెళ్లి పర్టిక్యులర్‌గా గమనిస్తే తప్ప వాటంతట అవే క్రేజీగా కనిపిస్తున్న దాఖలాలైతే లేవు. ఇటు తెలుగులో అదిగో... ఇదిగో అంటూ నాగచైతన్య, సాయిధరమ్‌తేజ్ సినిమాల పేర్లు వినిపిస్తున్నాయేగానీ, ఖరారైన దాఖలాలు కనిపించడం లేదు.

కలిసొచ్చిన ఖాళీని సొంత పనులకు బాగానే వాడుకుంటున్నారు పూజా హెగ్డే. రీసెంట్‌గా బాంద్రాలో తీసుకున్న ఇంటికి ఇంటీరియర్‌ని పూర్తి చేస్తున్నారు.

ఈ విషయంలో బుట్టబొమ్మకి ఆమె బోయ్‌ఫ్రెండ్ రోహన్ మెహ్రా హెల్ప్ చేస్తున్నారన్నది టాక్. గత కొంతకాలంగా రోహన్ మెహ్రాతో పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తున్నారు పూజా హెగ్డే.

కలిసి లంచ్‌లకు, డిన్నర్‌లకు వెళ్తూ పాపరాజీల కంట పడుతున్నారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్టే ఉంది వీరిద్దరి యాటిట్యూడ్.

ఇద్దరికీ ఇప్పుడు కెరీర్ పరంగా పెద్ద హై అయితే లేదు. ఎలాగూ సమయం కుదిరింది కాబట్టి, అలా పర్సనల్ స్పేస్‌లో ఉండనివ్వండి అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్.