Kannappa Movie: బీటెక్ పూర్తి చేసి.. భరత నాట్యం నేర్చుకుని.. కన్నప్ప సినిమా హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఫొటోస్

Edited By:

Updated on: Jun 27, 2025 | 1:01 PM

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ రోజు (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లోనూ ఈ సినిమా రిలీజైంది. కాగా ఈ సినిమాలో నెమలి అనే రాకుమార్తెగా ప్రీతి ముకుందన్ నటించింది.

1 / 6
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కథానాయికగా తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ నటించింది. ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా. గతంలో ప్రీతి ముకుందన్ శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్‌ సినిమాలో నటించింది.

2 / 6
 తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్  చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది. హిప్‌హాప్‌ నృత్యంలోనూ ప్రావీణ్యం సొంతం చేసుకుంది. ఇక చదువు విషయానికి వస్తే బీటెక్‌ పూర్తి చేసింది.

3 / 6
 కాలేజీ రోజుల్లో మోడలింగ్‌ చేసింది ప్రీతి. ఈ క్రమంలోనే పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఇక సినిమాల్లోకి రాక ముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది ప్రీతి ముకుందన్.

4 / 6
 ప్రీతి నటించిన మొదటి మ్యూజిక్‌ ఆల్బమ్‌ ‘ముత్తు ము2’. యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌కు దాదాపు 6 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక ఓం భీమ్ బుష్‌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైందీ అందాల తార. ఈ మూవీలో ఆమె జలజ అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రీతి.

5 / 6
 ఓం భీమ్ బుష్' తర్వాత ప్రీతి చేసిన మ్యూజిక్ వీడియో 'ఆశ కూడ' ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్షా 'మోర్నీ' మ్యూజిక్ వీడియోలోనూ సందడి చేసిందీ అందాల తార.

6 / 6
 ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.