
సీతారామం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో పాపులర్ అయ్యింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ఈ చిన్నది. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మృణాల్.

తొలి సినిమాలో సీతామహాలక్ష్మీ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది మృణాల్ ఠాకూర్.

ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మృణాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ క్రేజీ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది మృణాల్ ఠాకూర్.

ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ ఓ అరుదైన వ్యాధితో భాదపడుతోందట. మృణాల్ ఠాకూర్ రేచీకటితో బాధపడుతోంది తెలుస్తోంది. ఇందులో నిజం లేదు. ప్రస్తుతం మృణాల్ ఓ హిందీ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో ఆమె రేచీకటితో బాధపడుతున్న యువతిలా కనిపించనుందట.