
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నారు. టెంపర్ నుంచి ఫ్లాప్ అంటే తెలియదు తారక్‌కు..! మధ్యలో RRR లాంటి 1000 కోట్ల సినిమా కూడా ఉంది. గతేడాది దేవరకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా తట్టుకుని 400 కోట్లకు పైగా వసూలు చేసింది.

తెలుగు రాష్ఠ్రాల్లో 112 కోట్ల బిజినెస్ చేస్తే.. 162 కోట్లు షేర్ వసూలు చేసింది దేవర. అది ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా..! ఎన్టీఆర్ సినిమా అంటే రికార్డ్ బిజినెస్ కామన్ అయిపోయింది.

అయితే తాజాగా వార్ 2 విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎంత ఎన్టీఆర్ ఉన్నా.. బాలీవుడ్ అనువాద చిత్రమే. అందుకే ఈ సినిమా బిజినెస్ తారక్ స్ట్రెయిట్ తెలుగు సినిమాల స్థాయిలో అయితే జరగట్లేదు.

తెలుగు స్టేట్స్ రైట్స్ 90 కోట్ల వరకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తుంది.నిజానికి 90 కోట్లు అంటే ఎన్టీఆర్ ఇమేజ్‌కు చిన్న విషయమే..! కానీ డబ్బింగ్ సినిమా పరంగా పరంగా చూస్తే మాత్రం ఇది కొత్త రికార్డే. తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారనే దాన్నిబట్టి కూడా వార్ 2 ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఆగస్ట్ 14న వార్ 2 విడుదల కానుంది. జులై చివరి వారం నుంచే ప్రమోషన్స్‌కు హాజరు కానున్నారు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.