
మళయాళ బ్యూటీ హానీ రోజ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది హానీ రోజ్.

బాలయ్య సరసన హానీ రోజ్ నటించి తన అందంతో ఆకట్టుకుంది. హానీ రోజ్ అందాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.

మలయాళంలో సినిమాలు చేస్తోంది హానీ రోజ్. ప్రస్తుతం ఈ భామకు ఇటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు అటు గ్లామర్ పాత్రలు కూడా వస్తున్నట్లు టాక్.

ఇక ఇప్పుడు ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా కోటిరూపాయల వరకు డిమాండ్ చేస్తుందట ఈ చిన్నది.

ప్రస్తుతం రాచెల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది. ఇక విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో హానీ రోజ్ స్పెషల్ సాంగ్ చేయనుందట.