కథల విషయంలోనే కాదు.. లుక్ విషయంలో కూడా వేరియేషన్ చూపిస్తున్నారు కోలీవుడ్ హీరోస్. రెగ్యులర్ లుక్‌తో బోర్ కొట్టించకుండా.. ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు ప్రీపేర్ అవుతున్నారు.
ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న హీరోలందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. త్వరలో తంగలాన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు వర్సటైల్ స్టార్ విక్రమ్. ఈ సినిమాలో అడవి మనిషి తరహాలో డిఫరెంట్ లుక్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు.
పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా విక్రమ్‌లోని నటుణ్ని మరింత కొత్త పరిచయం చేయనుంది. విక్రమ్ సినిమాలో మూడు నాలుగు నిమిషాలే తెర మీద కనిపించిన సూర్య... ఆ క్యారెక్టర్ కోసం చాలా వర్కవుట్ చేశారు. రూత్ లెస్ కిల్లర్‌గా కనిపించేందుకు థిక్ బియర్డ్‌తో రఫ్ అండ్ టఫ్‌గా రెడీ అయ్యారు.
త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కంగువలో మరో డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు నడిప్పిన్ నాయగన్. ఆకాశం నీ హద్దురా సినిమాలో 80స్ కామన్ మ్యాన్‌గా కనిపించిన ఈ స్టార్ హీరో... తరువాత జై భీమ్ కోసం లాంగ్ హెయిర్‌తో సిన్సియర్ అండ్ సీరియస్ లుక్‌కి మారిపోయారు.
అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు సూర్య. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. కమల్ హాసన్ కూడా లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విక్రమ్ సినిమాలో స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన యూనివర్సల్ స్టార్, నెక్ట్స్ ఇండియన్ 2 కోసం ఏజ్ ఓల్డ్ గెటప్‌లోకి మారిపోతున్నారు.
ఇక కమల్ - మణి కాంబోలో లోకనాయకుడి లుక్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. పెద్దగా లుక్ విషయంలో డిఫరెన్స్ చూపించకపోయినా... హెయిర్ స్టైల్స్ మేనరిజమ్స్‌తోనే వేరియేషన్స్ చూపిస్తున్నారు దళపతి విజయ్.
లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయకపోయినా... ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెంట్ మేనరిజంతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. బీస్ట్, లియో సినిమాల్లో లైట్‌గా వైట్ హెయిర్‌తో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి షిప్ట్ అయ్యారు.