
టాలీవుడ్ నటి కోమలి ప్రసాద్ శుక్రవారం (ఆగస్టు 15) విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది.

అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం బయట సరదాగా ఫొటోలు దిగింది కోమలి ప్రసాద్. ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా ఇటీవల న్యాచురల్ స్టార్ నానితో కలిసి హిట్-3 సినిమాలో నటించింది కోమలి ప్రసాద్. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

2016లో సీతాదేవి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది కోమలి ప్రసాద్. నెపోలియన్, అనుకున్నది ఒకటి అయినది మరొకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524, హిట్-2, హిట్-3 తదితర హిట్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

వైజాగ్ కు చెందిన కోమలి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ప్రవర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసిన్ పూర్తి చేసింది. . మెడిసిన్ పూర్తయ్యాక న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేద్దామనుకుంది.

అదే సమయంలో అనుకోకుండా సినిమా ఛాన్స్ రావడంతో మాస్టర్స్ అప్లికేషన్ కూడా చించేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కోమలి. తెలుగుతో పాటు కొన్ని తమిళ్ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార.