పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయిన శ్రీలీల. తొలి సినిమాతోనే అందం చలాకీతనంతో ఆకట్టుకుంది. మొదటి సినిమా మంచి విజయం అందుకోవడంతో నెక్స్ట్ సినిమా ఏకంగా రవితేజ సరసన పట్టేసింది. దాంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట ఈ బ్యూటీ
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది షాలినీ పాండే. మొదటి సినిమా భారీ విజయాన్ని అందించినప్పటికీ ఈ అమ్మడు టాలీవుడ్ లో రాణించలేక పోయింది ఈ బ్యూటీ .. దానికి కారణం రెమ్యునరేష్ పెంచేయడమే అంటున్నారు కొందరు
రీతువర్మ పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ కూడా ఇప్పుడు షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట
ఖిలాడి సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగున్న మీనాక్షి చౌదరి. ఈ చిన్నది కూడా ఇప్పుడు తన రెమ్యునరేషన్ తో నిర్మాతలను భయపెడుతుందని టాక్
అలాగే ఖిలాడి సినిమాలో నటించిన మరో ముద్దుగుమ్మ డింపుల్ హయతి కూడా తన పారితోషకాన్ని పెంచేసిందని తెలుస్తుంది. అందాలు ఆరబోయడంలో మొహమాటపడని ఈ బ్యూటీ కూడా భారీగానే డిమాండ్ చేస్తుందట
ఇక రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు సినిమాతో మంచి హిట్ అందుకున్న నేహా శెట్టి ఇప్పుడు.. క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. డీజే టిల్లు హిట్ అవడంతో పలువురు దర్శకనిర్మాతలు తనకు ఆఫర్లు ఇచ్చారట. అయితే పారితోషికంలో కొండెక్కి కూచోవడంతో పునరాలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.