
సినిమా రంగంలో టాలెంట్‌తో పాటు సెల్ఫ్ ప్రమోషన్ కూడా చాలా అవసరం. అందుకే టాప్ స్టార్స్ కూడా సొంత పీఆర్ టీమ్‌ను మెయిన్‌టైన్ చేస్తుంటారు. తమ ప్రతీ మూవ్‌ను ఫ్యాన్స్‌కు రీచ్ అయ్యేలా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్లు అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు.

ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సాయి పల్లవి మాత్రం తనకు పీఆర్ కల్చర్ మీద నమ్మకం లేదంటున్నారు. గతంలో పీఆర్‌ను పెట్టుకోవాలని సన్నిహితులు సలహా ఇచ్చారని, కానీ తాను నో చెప్పానన్నారు.

పీఆర్ పబ్లిసిటీ వల్ల అవకాశాలు వస్తాయన్న నమ్మకం తనకు లేదన్న రౌడీ బేబీ, ఆడియన్స్ రెగ్యులర్‌గా న్యూస్‌లో చూస్తూ ఉంటే వాళ్లకు బోర్ కొట్టేస్తానని సెటైర్ వేశారు సహజ నటి సాయి పల్లవి.

సాయి పల్లవి మాత్రమే కాదు గతంలో ప్రియమణి కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. నార్త్‌లో వరుస సినిమాలు చేసినా.. మీడియాలో ప్రియమణి పెద్దగా కనిపించరు ఈ సీనియర్ స్టార్ హీరోయిన్.

ఈ విషయం ఆమెనే స్వయంగా అడిగితే... పాపారాజీస్‌కు తాను డబ్బులు ఇవ్వనని అందుకే తాను ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండనని అసలు సీక్రెట్ బయట పెట్టారు. మరి నిజంగానే కెరీర్ మీద పీఆర్ ఇన్‌ప్ల్యూయన్స్ ఉంటుందా..? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది..? ఈ విషయంలో ఎవరి ఆలోచన వారిది.