
కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఖుషి రిలీజ్ టైమ్‌లో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది.

ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. త్వరలో కెరీర్ రీస్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్న సామ్ టాలీవుడ్‌ను లైట్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

శాకుంతలం, ఖుషి సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత, ఆ తరువాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిలిం నగర్‌లో వైరల్ అయ్యింది.

అందుకు తగ్గట్టుగా సామ్ కొత్త సినిమాలేవి కమిట్ కాకపోవటంతో సమంత బ్రేక్ తీసుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. తాజాగా సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారన్న టాక్ మొదలైంది.

కానీ ఈ టిప్స్ సమంతను చిక్కుల్లో పడేస్తున్నాయి. శాకుంతలం సినిమా రిలీజ్‌కు ముందు ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు సమంత. ఆ టైమ్‌లో తను ఫేస్ చేసిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఓ డాక్టర్‌తో కలిసి పాడ్ కాస్ట్ వీడియో చేశారు.

తన అనుభవాలను షేర్ చేసుకున్నానే తప్ప ఎవరినీ మిస్ లీడ్ చేసే ఉద్దేశం లేదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతీ సారి సమంత చిక్కుల్లో పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.

తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమా విషయంలోనూ సమంత పేరే వినిపిస్తోంది. దీంతో సమంత టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేస్తారా అన్న డిస్కషన్ జరుగుతోంది.