
సాండల్‌వుడ్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు హోల్ ఇండియాను రూల్ చేస్తున్నారు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ.

అయితే కమర్షియల్ సినిమాల్లోనూ పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

తాజాగా కుబేర సినిమాలో రష్మిక లుక్‌ను రివీల్ చేసింది మూవీ టీమ్. ఈ టీజర్‌లో మిస్టీరియస్‌గా ఉన్న క్యారెక్టర్‌లో ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు రష్మిక. ఈ లుక్ చూశాక రష్మిక మూవీ సెలక్షన్ గురించి చర్చ జరుగుతోంది.

కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ రోల్స్ కూడా చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య వరుసగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నార్త్ మూవీస్ విషయంలో ఈ ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నారు.

గుడ్ బైతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తరువాత మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉన్న లైనప్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది.

పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్న రష్మిక, అదే సమయంలో రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

హిందీలోనూ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్‌కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. హిస్టారికల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఛావా, కమర్షియల్ ఎంటర్‌టైనర్ సికందర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు మేకర్స్.