Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార.. నార్త్ లో ఆలియా, సౌత్‌లో నయన్..
నిన్నటిదాకా దూరం దూరం అంటున్న నయనతార, ఇప్పుడు ఆ దూరాన్నే దూరం పెట్టేశారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అయ్యారు. జస్ట్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ జోరు పెంచుతున్నారు నయన్. ఆమెలో వచ్చిన మార్పు చూసి వారెవా అంటున్నారు జనాలు. ఫెలో హీరోయిన్లు దాస్తున్న ఓ విషయంలో నయన్ మాత్రం యమా ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా? కిడ్స్ టాపిక్ అండీ!