
డైరెక్టర్ ఎలాంటి డ్రెస్ వేసుకోమంటే నేను అదే వేసుకున్నా.. కానీ ఆ సినిమాలో నేను లావుగా ఉన్నానంటూ చాలా మంది కామెంట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

డిజిటల్ షో విషయంలోనూ వివాదాలను ఫేస్ చేశారు నయన్. ఆ షోలో నానూమ్ రౌడీదాన్ సినిమా కంటెంట్ వాడటంపై ధనుష్ అభ్యంతరం చెప్పటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు నయనతార. దీంతో ఈ ఇద్దరి వివాదం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా సౌత్ సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేస్తున్న పేరు. హీరోయిన్‌గా పరిచయం అయిన దగ్గర నుంచి టాప్ స్టార్స్‌తో జోడి కడుతున్న ఈ బ్యూటీ, ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు.

ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్‌లో స్లో అయినా.. నయన్ మాత్రం ఇప్పటికీ అదే జోరు మెయిన్‌టైన్ చేస్తున్నారు. ప్రజెంట్ సీనియర్ హీరోలకు సరైన జోడీ దొరకటం కష్టంగా ఉంది.

ఈ గ్యాప్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటున్న నయన్, సీనియర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఆ సినిమాల్లోనూ జస్ట్ గ్లామర్ డాల్‌లా కాకుండా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలకే ఓకే చెబుతున్నారు.

లేటెస్ట్ షోలో తన కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు నయనతార. గజిని సినిమాలో తన లుక్స్ విషయంలో అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేసుకున్నారు.

నయన్ కూడా ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

బిల్లా సినిమా టైమ్‌లోనూ అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నా అన్నారు నయన్. ఆ సినిమాలో బికినీలో కనిపించటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో డిస్కషన్ మొదలైందన్నారు.