
భర్త కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. నిర్మాతగా డైరెక్టర్ డిఫరెంట్ మూవీస్‌తో మెప్పించిన విఘ్నేష్ శివన్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటారు.

తాజాగా ఓ యంగ్ హీరోతో కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన విఘ్నేష్, ఆ సినిమా టైటిల్‌తో కాంట్రవర్సికి తెర లేపారు. దీంతో ఈ వివాదంలోకి నయన్‌కు లాగుతున్నారు నెటిజెన్స్.

నానుమ్ రౌడీదాన్, తానా సేంద కూట్టం లాంటి డిఫరెంట్ మూవీస్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విఘ్నేష్ శివన్. అయితే దర్శకుడిగా వచ్చిన గుర్తింపు కంటే నయన్ భాయ్ ఫ్రెండ్‌గానే ఎక్కువ పాపులర్ అయ్యారు ఈ యంగ్ డైరెక్టర్.

నయన్‌తో పెళ్లి తరువాత దర్శకత్వ బాధ్యతలకు బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. కాత్తువాక్కుల రెండు కాదల్ సినిమాతో మరో డీసెంట్ హిట్ అందుకున్న విఘ్నేష్, రీసెంట్‌గా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సినిమాను ఎనౌన్స్ చేశారు.

రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిలే ఇప్పుడు విఘ్నేష్‌ను చిక్కుల్లో పడేసింది. తన నెక్ట్స్ మూవీకి ఎల్ఐసీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ఎనౌన్స్ చేశారు విఘ్నేష్.

అయితే ఈ టైటిల్ చాలా ఏళ్ల క్రితమే తాను రిజిస్టర్ చేసుకున్నట్టుగా మరో నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్టు ఎల్ఐసీ సంస్థ కూడా టైటిల్ మార్చాలంటూ చిత్రయూనిట్‌కు వార్నింగ్ ఇచ్చింది.

వివాదం విఘ్నేష్ చుట్టూనే తిరుగుతుండటంతో నయన్ కూడా నిర్మాణ భాగస్వామి కావటంతో ఆమెను కూడా టార్గెట్ చేస్తున్నారు నెటిజెన్స్.