
సిల్వర్ స్క్రీన్ మీద పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు హీరోయిన్ నర్గిస్ ఫక్రి. అలాంటి బంపర్ హిట్ సినిమా ఆమెకు నార్త్ లో పడే ఛాన్స్ లేదా? ఈ సారి సౌత్ నుంచే సక్సెస్ కావాలనుకుంటున్నారా.?

నర్గిస్ వాంటెడ్‌గా చేసినా, చేయకపోయినా, ఆమె మాటలు, చేష్టలు మాత్రం ఈ విషయాన్నే సజెస్ట్ చేస్తున్నాయి.. ఇంతకీ నర్గిస్ ఏమన్నారేంటి? అంటారా.! నర్గిస్ ఫక్రి నార్త్ సినిమాల్లో అడుగుపెట్టి పుష్కరం దాటింది.

బోల్డ్ సీన్స్ కి నో చెప్పకపోయినా, డ్యాన్సింగ్ స్కిల్స్ మెండుగా ఉన్నా, ఎందుకో అనుకున్నంత ఫేమ్ తెచ్చుకోలేకపోయారు ఈ బ్యూటీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు స్పెషల్ వీడియో సాంగులు, ఓటీటీ సీరీస్‌ల మీద కూడా కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు.

ఎంత ట్రై చేస్తున్నా బొంబాట్ కాలేకపోతున్నామని అనుకున్నారేమో.. లేటెస్ట్ గా సౌత్ మీద ఫోకస్ చేశారు. అందులోనూ విమర్శలు, ప్రశంసలూ అందుకున్న యానిమల్ సినిమా మీద కాన్‌సెన్‌ట్రేట్ చేశారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ అద్భుతంగా ఉందని పొగిడేశారు నర్గిస్.

అంతే కాదు, అతని సినిమాల్లో హీరోయిన్లను ప్రొజెక్ట్ చేసే తీరు చాలా నచ్చిందని, అవకాశం ఉంటే సినిమా చేయడానికి సిద్ధమని కూడా సిగ్నల్స్ పంపేశారు. ఇంతకీ అవి సందీప్ చెవిలో పడ్డట్టేనా.? నర్గిస్ సౌత్ సినిమా హరిహరవీరమల్లు సెట్స్ మీదుంది.

టాలీవుడ్‌లో ఫస్ట్ సినిమానే ఏకంగా పవర్‌స్టార్ పక్కన చేస్తున్నారు ఈ బ్యూటీ. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే, ఈ పాటికే నర్గిస్‌కి సౌత్‌లో క్రేజ్ ఎలా ఉందో అర్థం అయ్యేది.

హరిహరవీరమల్లుని ఈ ఏడాదే స్క్రీన్స్ మీదకు తీసుకొచ్చేస్తామని మేకర్స్ రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ మూవీ రిజల్ట్ మీదే నర్గిస్ సౌత్ ఛాన్సులు ఆధారపడ్డాయని అంటున్నారు క్రిటిక్స్.