Krithi Shetty: కృతి శెట్టిని లైట్ తీసుకున్నారా..? ఆఫర్లు కరువయ్యాయే..!!

|

Feb 18, 2023 | 9:27 PM

ఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది.

1 / 8
తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామ కృతి శెట్టి. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ మంగుళూరు బ్యూటీ.

2 / 8
తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది కృతి. ఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి..

3 / 8
ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది..

4 / 8
 ఆ వెంటనే నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో చైతూతో జతకట్టింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలను అందుకొని స్టార్ గా మారిపోయింది.

5 / 8
అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

6 / 8
ఆ వెంటనే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో ఈ అమ్మడు స్పీడ్ తగ్గించింది.

7 / 8
ఇక ఒప్పుకున్నా ఏకైక సినిమా కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. సూర్య హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.

8 / 8
 ప్రస్తుతం కృతిశెట్టి నాగచైతన్య నటిస్తోన్న కస్టడీ అనే సినిమాలో మాత్రమే చేస్తోంది. ఆ సినిమా హిట్ అయితే తప్ప కృతి తిరిగి ఫామ్ లోకి రావడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు..