
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది అవికా గోర్.

సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారింది.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ సినిమాలో అవికా నటనకు మంచి మార్కులు పడ్డాయి.. మొదటి సినిమాతోనే మెప్పించింది.

ఆ తరువాత కూడా అదే రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చూపిస్తా మామ సినిమా చేసింది.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ అమ్మడి ఫాలోయింగ్ తగ్గలేదు.

తెలుగులోనే కాకుండా.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమలు చేస్తుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా కూడా అడుగువేసింది.

ఇక అవికా సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.. ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తిన ఈ అమ్మడు తాజాగా ట్రెడిషన్ లుక్ లో మరోసారి అందరిని ఆకట్టుకుంది.