Anushka Shetty: మళ్లీ అభిమానుల ముందుకు అనుష్క.! ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ స్వీటీ బ్యాక్..
చాలా కాలం తరువాత ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. బాహుబలి తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డ ఈ బ్యూటీ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ షూటింగ్స్ కూడా పూర్తి చేసిన ఈ బ్యూటీ, త్వరలో ప్రమోషన్స్‌లో అభిమానులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత నార్మల్ లుక్‌లోకి రావటంలో ఇబ్బంది పడ్డారు.