
అనుపమ పరమేశ్వరన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. అందం ఉన్నా.. పాపం అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే హోదాకు చాలా దూరంలోనే ఆగిపోయింది ఈ బ్యూటీ. ఒకప్పుడు వరస విజయాలతో పాటు అవకాశాలు కూడా అందుకున్న అనుపమ.. చేజేతులా బంగారం లాంటి కెరీర్ పాడు చేసుకుంది.

రెమ్యునరేషన్ కారణంగా రంగస్థలం లాంటి అద్భుతమైన సినిమాలు కాదనుకోవడంతో ఇప్పటికీ కోలుకోలేకపోతుంది అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళ కుట్టి చేతుల్లో ఇప్పుడు సినిమాలు తక్కువగానే ఉన్నా.. మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపైనే ప్రస్తుతం అనుపమ ఆశలన్నీ ఉన్నాయి.

అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా టిల్లు స్క్వేర్. ఎందుకంటే ఈ సినిమాలో అమ్మడు అందాల ఆరబోతకు తెర తీసింది కాబట్టి. అవకాశాల కోసం హీరోయిన్ల దగ్గర ఉన్న చివరి అస్త్రం గ్లామర్ షో. కొందరైతే ఎప్పటికీ గ్లామర్ షోకు నో చెప్తూనే ఉంటారు కానీ మరికొందరు మాత్రం అప్పటి వరకు పద్దతిగా కనిపించినా ఓ సమయంలో కాస్త పట్టువిడుపు ప్రదర్శిస్తుంటారు.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కెరీర్ మొదట్నుంచీ గ్లామర్‌కు దూరంగా ఉండి.. ఇప్పుడిప్పుడే అటు వైపు అడుగులేస్తుంది ఈ బ్యూటీ. అయినా కెరీర్‌లో ఓ టైమ్ వచ్చాక హీరోయిన్స్ మారిపోతుంటారు. దీనికి అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ ఎగ్జాంపుల్. కెరీర్ మొదట్లో చాలా అంటే చాలా పద్దతిగా కనిపించింది ఈ బ్యూటీ.

కానీ కొన్నేళ్లుగా ట్రెండ్‌కు తగ్గట్లు అనుపమ మారిపోయింది. మెల్లగా గ్లామర్ వైపు అడుగులేస్తుంది. గతేడాది రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా లిప్ లాక్స్ కూడా ఇచ్చింది ఈ భామ. అసలు ఈమె నుంచి లిప్ లాక్ సీన్స్ ఎక్స్‌పెక్డ్ చేయడం చిన్న విషయం కాదు. కానీ చేసి చూపించింది అనుపమ. తాజాగా టిల్లు స్వ్కేర్‌లో మరింతగా రెచ్చిపోతుంది అనుపమ.

డిజే టిల్లు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డతో రొమాన్స్ బాగానే పండిస్తుంది అనుపమ. ఫస్ట్ సాంగ్‌లోనూ అమ్మడు రెచ్చిపోయింది. తాజాగా విడుదలైన పాటలోనూ అను అందాలే ప్రధానాకర్షణ. క్లీవేజ్ షోలతో సైతం కిక్కెక్కిస్తుంది అనుపమ. పాటల్లోనే ఈ రేంజ్‌లో రెచ్చిపోతుంటే.. రేపు సినిమాలో ఎలా ఉంటుందో అనే అంచనాలు బాగా పెరిగిపోయాయి. డిజే టిల్లు సీక్వెల్‌కు సిద్ధూ ఎంత స్టార్ అట్రాక్షన్ అవుతాడో.. అంతకుమించి అనుపమ అందాలు ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ కాబోతున్నాయి.

అనుపమ ఇమేజ్‌తోనే ఓపెనింగ్స్ మరింత బలంగా ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 9న విడుదల కానుంది టిల్లు స్క్వేర్. కేవలం అనుపమ పరమేశ్వరన్ మాత్రమే కాదు.. కీర్తి సురేష్ సైతం ఈ మధ్య కాస్త పట్టువిడుపు ప్రదర్శిస్తుంది. లాస్ట్ ఇయర్ సర్కారు వారి పాటలో అప్పటి వరకు చూడని కీర్తి కనిపించింది. మహేష్‌తో ఛాన్స్ రావడంతో.. గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ.

ఉప్పెనతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి గ్లామర్ షో చేయాల్సిన అవసరం రాకుండానే వరస ఆఫర్స్ వచ్చేసాయి. కానీ ఈ మధ్య ఫ్లాపులు కూడా వరసగానే వచ్చేయడంతో.. గ్లామర్ షో మినహా మరో ఆప్షన్ లేకుండా పోయింది ఈ భామకు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ షోతో మతులు చెడగొడుతుంది బేబమ్మ. మొత్తానికి ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం హీరోయిన్లకు ఈ తిప్పలు అయితే తప్పట్లేదు.