ఎట్ ఎ టైమ్.. సింగిల్ వర్క్.. అనే మాటకి కాలం ఎప్పుడో చెల్లిపోయింది. మల్టీటాస్కింగ్‌కే మంచి డిమాండ్ ఉందిప్పుడు. మన హీరోలు కొందరు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నా.. మరోవైపు డైరక్షన్‌లోనూ ప్రూవ్ చేసుకుంటున్నారు.
ధనుష్ ఇప్పుడు యమా బిజీ. ఓ వైపు తమిళ సినిమాలు. ఇంకోవైపు తెలుగు ప్రొడక్షన్ హౌస్‌ల్లో ప్రాజెక్టులు అంటూ హీరోగా ఫుల్ హెక్టిక్‌గా ఉన్నారు. అయినా, ధనుష్ తన ప్యాషన్‌ని మర్చిపోవడం లేదు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ కెప్టెన్ కుర్చీలో అప్పుడప్పుడూ కూర్చుంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఇడ్లీ కడై ప్రాజెక్టును సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది ఇడ్లీకడై. తిరుచిత్రంబలం తర్వాత ధనుష్, నిత్యమీనన్ కలిసి నటిస్తున్నారు.
ధనుష్ స్టోరీ ఇలా ఉంటే, పృథ్విరాజ్ సుకుమారన్‌ది ఇంకా పెద్ద స్టోరీ. ఆయన ఓ వైపు మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. అదర్ లాంగ్వేజెస్‌లో విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరుంది. అయినా మోహన్‌లాల్‌లాంటి స్టార్ హీరోతో ఎల్2 ఎంపురాన్‌ని డైరక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎర్లీ సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది ఎల్ 2 ఎంపురాన్.
మన హీరోల్లో విశ్వక్సేన్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. హీరోగా విశ్వక్ బిజీగా ఉన్నారు. అయినా ఆయన డైరక్షన్ మీద కూడా కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఆల్రెడీ డైరక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న విశ్వక్, త్వరలోనే ఫలక్‌నుమాదాస్ సీక్వెల్ తెరకెక్కిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది.