
సినిమాలకు బజ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అందులోనూ ఆ బజ్... ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడాలంటే ఇంకేం చేయాలి.? ఏదో ఏదో చేయడం ఎందుకు.?

జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఏదో ఒక కాంట్రవర్శీ మాట్లాడితే సరిపోతుంది కదా.. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఇదే ఫ్యాషన్. అందుకేనేమో.. విశ్వక్సేన్ కూడా ఆలోచించకుండా ఫాలో అయిపోయారు.

విన్నారుగా.. ఇవీ విశ్వక్‌సేన్ అన్న మాటలు. పది సినిమాలు అయ్యాయి.. ఫస్ట్ టైమ్ టెన్స్ ఫీల్ అవుతున్నానంటూ విశ్వక్సేన్ అన్న మాటలు... ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజంగానే ప్రిపేర్ అయింది మర్చిపోయి..

ఇలా మాట్లాడారా.. లేకుంటే, ఏదోలా కాంట్రవర్శీ డైలాగులు నాలుగు చెప్పాలని ఇలా అనేశారా... అంటూ ఆయన స్పీచ్ గురించి జోరుగానే డిస్కషన్ జరుగుతోంది నెట్టింట్లో.

మేం ఇట్లనే మాట్లాడతం... మా సినిమాను ఇలాగే ప్రమోట్ చేసుకుంటాం.. మేం ఏం తప్పు చేయడం లేదు... అంటూ క్రిటిక్స్, రివ్యూయర్ల గురించి మాట్లాడటం ఇదే లాస్ట్ అంటూ చెప్పదలచుకున్న విషయాలను చెప్పేశారు విశ్వక్.

పర్సనల్ లెవల్లో అటాక్ చేస్తే వీపు పగులుద్ది అంటూ రెచ్చిపోయి స్టేట్‌మెంట్ ఇచ్చారు. మెకానిక్ రాకీ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా... మళ్లీ మళ్లీ సినిమాలు చేయడమే తెలుసు నాకు.. అంటూ నేనింతే తరహా డైలాగులు చెప్పారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోలు ఇలా ఓపెన్ కావడం ఈ మధ్య కాలంలో అడపాదడపా కనిపిస్తూనే ఉంది. తనను ట్రోల్ చేయవద్దని క వేడుకలో కిరణ్ అబ్బవరం, తన పెదనాన్నను, అన్నను గురించి పదే పదే మాట్లాడతానని ఆ మధ్య వరుణ్‌తేజ్.. లేటెస్ట్ గా రివ్యూయర్ల గురించి విశ్వక్‌సేన్.

నియర్ ఫ్యూచర్‌లో ఇంకెవరు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతారో చూడాలి. పబ్లిసిటీ కోసం లక్ష మార్గాలుండగా... ఇలా ఏదో ఒకటి మాట్లాడి హల్ చల్ చేయడం ఎందుకనే అసహనం కూడా వ్యక్తమవుతోంది. మరి వాటిని చెవిన వేసుకునే వారు ఎవరో లెట్స్ వెయిట్ అండ్ సీ.