
ప్రజెంట్ స్టార్ హీరోలంతా కమర్షియల్ ట్రెండ్‌లో దూసుకుపోతుంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీని ట్రై చేస్తున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలకు దూరంగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ కమర్సియల్ హిట్స్‌ను టార్గెట్ చేస్తున్నారు.

ప్రజెంట్ చెర్రీ కిట్టీలో ఉన్న సినిమాలన్నీ దాదాపు ఇలాగే కనిపిస్తున్నాయి. మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్ ఉన్న స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నా.. చెర్రీ మూవీ సెలక్షన్ మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తోంది.

ఈ స్టార్ వారసుడు రొటీన్ ఫార్ములా సినిమాలకు గుడ్ బై చెప్పేసి చాలా కాలం అవుతోంది. రంగస్థలం సినిమా తరువాత పూర్తిగా ట్రెండ్ మార్చేశారు మెగా పవర్ స్టార్. ట్రిపులార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్, అప్ కమింగ్ సినిమాల విషయంలో మరింత కేర్‌ఫుల్‌గా అడుగులు వేస్తున్నారు.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ కూడా చరణ్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీ అన్న టాక్ వినిపిస్తోంది. గేమ్ చేంజర్ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చరణ్.

ఆ సినిమా ఓ ప్రయోగం అని ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో రంగస్థలం సినిమాను మరిపించే రేంజ్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారట.

తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నారన్నది నయా అప్‌డేట్.

అసలు కమర్షియల్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ మూవీస్ చేసే హిరానీ, చరణ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.