
ఒక్క సినిమాతోనే రాజశేఖర్ దశ మారిపోనుందా..? ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ జాతకం కూడా ఇలాగే మారబోతుందా..?

ఈయనలోనూ మార్పు మొదలైందా..? ట్రెండ్‌కు తగ్గట్లు మారిపోతున్నారా..? ఎక్స్ ట్రా విడుదలకు ముందే రాజశేఖర్‌కు ఆఫర్స్ క్యూ కడుతున్నాయా..? తెలుగు ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మెన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు రాజశేఖర్.

ఈయన 60ల్లో ఉన్నా.. ఇప్పటికీ అదే బిరుదు కంటిన్యూ అవుతుంది. 90ల్లో అగ్ర హీరోగా ఉన్న రాజశేఖర్.. 2000 తర్వాత రేసులో వెనకబడిపోయారు. ఒకట్రెండు మినహా.. 20 ఏళ్లుగా చెప్పుకోదగ్గ సినిమాలైతే రావట్లేదు.

ఈ క్రమంలోనే ఇన్నాళ్లకు కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు రాజశేఖర్. నిజానికి చాలా రోజుల నుంచి రాజశేఖర్‌కు కారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తున్నా.. ఆయన మాత్రం హీరోగానే ట్రై చేసారు.

ఇన్నాళ్లకు నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న 'ఎక్స్ ట్రా'లో కీలక పాత్ర చేస్తున్నారు రాజశేఖర్. మొన్న ట్రైలర్‌లో లాస్ట్ షాట్ అదిరిపోయింది. జీవితం ఏం చెప్తే అదే చేయాలంటూ ఈయన చెప్పిన డైలాగ్ రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది.

ఇప్పటికే శ్రీకాంత్, జగపతిబాబు లాంటి సీనియర్ హీరోలు కారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. వాళ్ల కెరీర్ జోరు మీదున్నాయి. ఎక్స్ ట్రా రిలీజ్‌కు ముందే రాజశేఖర్‌కు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇక నితిన్ సినిమా కానీ హిట్టై.. అందులో రాజశేఖర్ రోల్ పేలిందంటే మాత్రం.. టాలీవుడ్‌కు మరో కారెక్టర్ ఆర్టిస్ట్ దొరికేసినట్లే. చూడాలిక.. ఈయన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో..?