Rajeev Rayala |
Nov 29, 2023 | 8:13 PM
హెబ్బా పటేల్.. 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.
అదే ఏడాది వచ్చిన అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
2015లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది హెబ్బా పటేల్.
ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది హెబ్బా పటేల్.
ఆతర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు అంతగా లేవు. దాంతో షోషల్ మీడియాతో గడిపేస్తోంది.