
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తైందని అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. రెండు రోజుల నుంచి ఈ చిత్ర సెట్‌లోనే ఉన్నారు పవర్ స్టార్. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది.. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడూ అని అడుగుతున్నారు ఫ్యాన్స్.

ఎట్టి పరిస్థితుల్లో మే నెల్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. ఓటీటీ సంస్థతో ఉన్న డీల్ కారణంగా, ఈ నెల్లోనే రిలీజ్ చేసేయాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో మేకర్స్ ఉన్నారని డిస్కస్ చేసుకుంటున్నారు ట్రేడ్ పండిట్స్.

అసలు సినిమా అనౌన్స్ అయిన ప్లానింగ్ ప్రకారం అంతా జరిగి ఉంటే కొన్నేళ్ల క్రితమే రిలీజ్ కావాల్సిన ప్రాజెక్ట్ ఇది. రకరకాల కారణాల వల్ల మల్టిపుల్ టైమ్స్ విడుదల వాయిదా పడింది. అందుకే, ఈ సారి మాటిస్తే వెనక్కి తిరిగే పరిస్థితే ఉండకూడదని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

క్రిష్ మొదలుపెట్టిన ఈ సినిమాను జ్యోతికృష్ణ కంటిన్యూ చేశారు. ఫైనల్ షెడ్యూల్‌లో త్రివిక్రమ్ కనిపించారు. గురూజీ సెట్లో కనిపించిన తర్వాత సినిమా గురించి మరింత ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ప్రాజెక్ట్ ష్యూర్‌షాట్ హిట్ కావడానికి గురూజీ సాయం తీసుకుని ఉండవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. బ్రో, భీమ్లానాయక్ సినిమాలకు గురూజీ ఇచ్చిన సపోర్ట్‌ని కూడా గుర్తుచేసుకుంటున్నారు.