సౌత్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్న నర్గీస్ ఫక్రీ, ఈ మధ్య రెగ్యులర్‌గా న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు. ఆ మధ్య తన సౌత్ డెబ్యూ మూవీ గురించి హింట్స్ ఇచ్చిన ఈ బ్యూటీ, రీసెంట్‌గా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. హిస్టరికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్ డ్రామాలో పవన్ బందిపోటు తరహా పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోట, హైదరాబాద్ చార్మినార్ సెట్స్ వేసి... ఆ సెట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రజెంట్ హోల్డ్‌లో ఉన్న ఈ సినిమాతో నర్గీస్ సౌత్ డెబ్యూకి రెడీ అవుతున్నారు.
ఆ మధ్య హరి హర వీరమల్లు కథకు సంబంధించి కీ పాయింట్‌ను లీక్ చేశారు నర్గీస్. ఈ సినిమాలో మొగళ్ యువరాణిగా నటిస్తున్నా అన్న ఈ బ్యూటీ, పవన్‌తో తన సీన్స్ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయన్నారు. దీంతో పవన్, నర్గీస్ మధ్య లవ్ ట్రాక్ ఉంటుందా..? అన్న డిస్కషన్ జరిగింది.
మరోవైపు నర్గీస్ క్యారెక్టర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో ఈ క్యారెక్టర్‌కు జాక్వెలిన్‌ను తీసుకోవాలని భావించారు. కానీ కోర్టు వివాదాలతో జాక్వెలిన్ ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె స్థానంలో నర్గీస్‌ను సెలెక్ట్ చేశారు.
తాజాగా తన కెరీర్ గురించి మరో ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. త్వరలో డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్న ఈ బ్యూటీ బోల్డ్ సినిమాకు స్ట్రిక్ట్‌గా నో చెప్పేశారు. డిజటల్‌లోనూ నటనకు ఆస్కారమున్న రోల్స్ మాత్రమే చేస్తానంటూ తెగేసి చెప్పారు నర్గీస్.